- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శర్వానంద్‌తో మరోసారి రొమాన్స్ చేయబోతున్న యంగ్ బ్యూటీ.. వెల్‌కమ్ ఆన్ బోర్డ్ అంటూ స్పెషల్ పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రజెంట్ ఆయన ‘నారి నారి నడుమ మురారి’(Nari Nari Naduma Murari) మూవీలో నటిస్తున్నాడు. అలాగే దీనితో పాటు ‘శర్వా-38’(Sharwa-38) అనే మూవీలో కూడా నటిస్తున్నాడు. 1960లో తెలంగాణ - మహారాష్ట్ర బార్డర్‌లో జరిగే పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందబోతున్న ఈ మూవీకు సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఈ సినిమా అప్డేట్స్ కోసం శర్వా ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం నుంచి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. ‘శర్వా, సంపత్ బ్లడ్ ఫెస్ట్ కోసం బ్లాక్ బస్టర్ చార్మింగ్ కాంబో తిరిగి కలుస్తోంది.. ఈ ఉత్తేజకరమైన రైడ్ కోసం #Sharwa38 బృందం అద్భుతమైన ప్రతిభావంతులైన యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran)ను గర్వంగా స్వాగతిస్తుంది.. #CharmingStar38 షూటింగ్ త్వరలో ప్రారంభమవుతుంది’ అని రాసుకొచ్చారు. కాగా శర్వానంద్- అనుపమ కాంబోలో వచ్చిన ‘శతమానం భవతి’(Shatamanam Bhavathi) సినిమా ఎంతగా విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.
ఇక పోస్టర్‌ను గమనించినట్లయితే.. మెడలో ఓ నల్ల దారం కట్టుకొని చెవులకు బుట్టాలు పెట్టుకుని, పంజాబీ డ్రెస్‌తో పాటు దుపట్టా కూడా కప్పుకొని ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలా కనిపిస్తుంది అనుపమ. అయితే పోస్టర్‌లో అనుపమను కేవలం హాఫ్ సైడ్ మాత్రమే కనిపించేలా చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.






