- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతనితో ఉన్న ఫొటో షేర్ చేసిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు.. పోస్ట్ వైరల్
‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఆర్‌ఎక్స్-100’(RX-100) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్(Payal Rajputh) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ తన నటనతో పాటు అందంతో కవ్వించింది. బోల్డ్ సీన్స్‌లో రెచ్చిపోయి నటించింది. ఫస్ట్ మూవీలోనే ఈ అమ్మడు ఆ రేంజ్‌లో అందాలు ఆరబోయడంతో, రెచ్చిపోయి నటించడంతో కుర్రకారు ఫిదా అయిపోయారు. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘వెంకీమామ’(Venkymama), ‘మంగళవారం’(Mangalavaram) సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం ‘వెంకట లచ్చిమి’(Venkata Lachimi) అనే లేడీ ఓరియెంటెడ్ మూవీతో మన ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Socila Media)లో యాక్టీవ్‌గా ఉండే ఈ భామ లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా పాయల్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ(Imran Hashmi)తో దిగిన ఓ క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. చాలా ‘జన్యూన్ అండ్ గ్రౌండెడ్ వ్యక్తిత్వం గత వ్యక్తిని కలవడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది’ అని రాసుకొచ్చింది. అలాగే మరొక ఫొటోలో ‘ఫ్యాన్ మూమెంట్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారగా.. నెటిజన్లు తన అభిమాన హీరోని కలిసినందుకు కంగ్రాట్స్ చెబుతున్నారు.






