ప్రియుడితో చాలా క్లోజ్‌గా దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు

by Gugulothu.Kavitha |

అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

ప్రియుడితో చాలా క్లోజ్‌గా దర్శనమిచ్చిన యంగ్ బ్యూటీ.. కంగ్రాట్స్ చెబుతున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: అతిలోక సుందరి తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. 'ధడక్'(Dhadak) అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచమైన ఈ చిన్నది బాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక తెలుగులో జాన్వీ ‘దేవర’(Devara) మూవీతో ప్రేక్షకులకు పరిచయం అయింది. తన ఫస్ట్ సినిమాతోనే మంచి ఫేమ్ తెచ్చుకోగా వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అలా ప్రజెంట్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana).. రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’(Peddi) మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిన్నదాని వ్యక్తిగత విషయానికి వస్తే.. గత కొంత కాలంగా శిఖర్ పహారియా(Shikher Paharia)తో డేటింగ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా అప్పట్లో మైదాన్ స్క్రీనింగ్‌లో అతని పేరు ఉన్న నెక్లెస్ ధరించి వావ్ అనిపించింది. దీంతో అందరూ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయారు. ఈ క్రమంలో ఈ జంటకు సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా వింబుల్డన్ 2025 సెమీ ఫైనల్స్ మ్యాచ్‌ను జాన్వీ కపూర్, శిఖర్ పహారియా వీక్షించారు. ఇందులో జాన్వీ అతని చేతిలో చేయి వేసి కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ జంటకు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Next Story