- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టన్నింగ్ లుక్స్‌లో యంగ్ బ్యూటీ.. వావ్ లుకింగ్ లైక్ ఎ హాట్ మిర్చి అంటున్న నెటిజన్లు(పోస్ట్)
నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, సినిమా: నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మెహ్రీన్ పిర్జాదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ.. తన ఫస్ట్ మూవీతోనే మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’, ‘జవాన్’, ‘ఎఫ్-2’, ‘కవచం’, ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వత్థామ’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఎఫ్-3’ వంటి సినిమాల్లో నటించి అలరించింది. కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రాలేదు. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చింది ఈ అమ్మడు.
కానీ కొన్ని నెలలకే నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని ప్రకటించింది. ఆ తర్వాత బక్క చిక్కిపోయి కనిపించిన ఈ భామ ఇప్పుడిప్పుడే మళ్లీ ఫామ్‌లోకి వస్తోంది. ప్రస్తుతం సినిమా ఆఫర్లు లేక సోషల్ మీడియాకే పరిమితం అయింది. అక్కడ నిత్యం లేటెస్ట్, హాటెస్ట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో రెడ్ కలర్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక వీటిని చూసిన నెటిజన్లు వావ్ లుకింగ్ లైక్ ఎ హాట్ మిర్చి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






