- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కడ మంచు వారి అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్న యంగ్ బ్యూటీ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’(Mehabooba) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’(DJ Tillu) మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.
ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పోస్ట్ చేసింది. అందులో మంచు వారమ్మాయి మంచు లక్ష్మితో పాటు మరికొంత మంది గర్ల్స్‌తో ఇండోనేషియాలోని బాలీలో ఎంజాయ్ చేస్తున్న పిక్ను పంచుకుంది. ఇక దీనికి మంచి మెమోరీస్ క్రియేట్ చేసే నా మెయిన్ గర్ల్స్ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ స్టోరీ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.






