వేటాడేందుకు వచ్చేస్తున్న యంగ్ బ్యూటీ.. ‘ఫియర్’ మూవీ అప్డేట్

by Mallepaka Hamsa |   (  Updated:2024-12-08 14:17:53  IST  )

యంగ్ బ్యూటీ వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫియర్’(Fear).

వేటాడేందుకు వచ్చేస్తున్న యంగ్ బ్యూటీ.. ‘ఫియర్’ మూవీ అప్డేట్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ వేదిక(Vedhika) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఫియర్’(Fear). డాక్టర్ హరిత గోగినేని(Haritha Gogineni) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతుంది. అయితే ఈ మూవీ దత్తాత్రేయ(Dattatreya) మీడియా బ్యానర్‌పై ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచాయి. అయితే ‘ఫియర్’ విడుదల కాకుండానే రికార్డ్ క్రియేట్ చేసింది. అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్‌లో 70కి పైగా అవార్డ్స్ గెలుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

అయితే ఈ సినిమా డిసెంబర్ 14న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా వరుస అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతున్నారు. ఈ రోజు ‘ఫియర్’ మూవీ నుంచి టైటిల్ సాంగ్ ను స్టార్ కొరియోగ్రాఫర్, హీరో రాఘవ లారెన్స్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ పాటకు కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా..మేఘన, నీల్ క్రితన్ ఆకట్టుకునేలా పాడారు. ఫియర్ టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇంగ్లీష్ లో ఉండటం ‌విశేషం. నాయిక వేదిక క్యారెక్టర్ ను భయాలు ఎలా చుట్టుముట్టాయి. ఆ ఫియర్ ప్రభావం ఆమె మీద ఎంతగా ఉందో చెప్పేలా ఈ పాటను డైరెక్టర్ డా. హరిత గోగినేని ఆసక్తికరంగా డిజైన్ చేశారు.

Next Story