- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహా కుంభ మేళాలో యంగ్ బ్యూటీ.. ఒక అనుభవం జీవితాంతం జ్ఞాపక మంటూ ఇంట్రెస్టింగ్ పోస్ట్
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, సినిమా: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
తాజాగా శ్రీనిధి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఉత్తర ప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభ మేళా(Maha Kumbh Mela)కు వెళ్లినట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అంతేకాకుండా వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ.. “నిజంగా ప్రయాగ్ నన్ను పిలిచినట్లు అనిపిస్తుంది. మొదట్లో నాకు అక్కడికి వెళ్లాలన్న ఆలోచన అండ్ వర్క్ బిజీ వల్ల దాని గురించి ఆలోచించలేదు. కానీ సడెన్‌గా ఏమైందో ఏమోకానీ నా పనుల్లన్నింటిని పక్కన పెట్టి వెంటనే టికెట్ బుక్ చేసుకున్నాను. దీనికి కారణం మా నాన్న.. అతను చివరి నిమిషంలో మనం కుంభమేళాకి వెళుతున్నామన్నారు.
అయితే ఇది నిజంగా మన జీవితంలో ఒకసారి జరిగేది, కాబట్టి ఎలాంటి ప్రశ్నలు అడగకుండా నాన్నకు ఓకే చెప్పేశాను.. ప్రజెంట్ నేను ఇక్కడే ఉన్నాను.. ఒక అనుభవం & జీవితాంతం జ్ఞాపకం” అంటూ క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకి ఇప్పటికే చాలామంది హీరో, హీరోయిన్స్ వెళ్ళి అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించిన సంగతి తెలిసిందే. ఇక వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తన పాపాలన్ని కడిగేసుకున్నామంటూ పలు పోస్టుల ద్వారా వెల్లడించారు.






