- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వాచ్ ధర ఎంతో తెలిస్తే ఖంగు తినాల్సిందే.. ప్రపంచంలో అవి ఎన్ని ఉన్నాయంటే?
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)2023లో ఏకంగా టైగర్-3, జవాన్ (jawan), పఠాన్(Pathan), డంకీ వంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు.

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)2023లో ఏకంగా టైగర్-3, జవాన్ (jawan), పఠాన్(Pathan), డంకీ వంటి చిత్రాల్లో నటించి సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎలాంటి సినిమా ప్రకటించలేదు. అలాగే సోషల్ మీడియా(Social Media)కు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఆయన కూతురు, కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేసి ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఈ క్రమంలో.. తాజాగా, షారుఖ్ ఖాన్ ఓ ఈవెంట్‌లో పాల్గొని సందడి చేశారు. ఐఐఎఫ్ఏ అవార్డ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కనిపించిన షారుఖ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇందులో ఓ ఖరీదైన వాచ్ ధరించి కనిపించి వార్తల్లో నిలిచారు.
ఈ ఈవెంట్ లో అందరి చూపు షారుఖ్ వాచ్ పైనే పడింది. అంతా దాని ధర గురించే నెట్టింట సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ వాచ్ అడెమర్స్ పిగట్ బ్రాండ్ వాచ్ అని సమాచారం. అది 18 క్యారెట్ స్కాండ్ గోల్డ్‌తో తయారవుతుందని తెలుస్తోంది. ఇక ఈ మోడల్ వాచ్‌లు ప్రపంచం మొత్తంలోనే 250 మాత్రమే ఉన్నాయట. ఒక్కో వాచ్ ఖరీదు ఏకంగా రూ. 76 లక్షల పైనే ఉంటుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈవిషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు షాక్ అవుతున్నారు. వామ్మో వాచ్‌కే అంత డబ్బు ఖర్చు చేశారా అని అంటున్నారు.






