- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Amitabh Bachchan: నువ్వు ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి.. స్టార్ హీరోపై అమితాబ్ బచ్చన్ ట్వీట్
అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’.

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’. రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించగా.. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల (Sreeleela)ఐటెం సాంగ్‌లో మెరిసింది. అయితే ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబడుతూ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో.. సినిమా చూసిన సినీ సెలబ్రిటీలు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఓ ట్వీట్ చేశారు. అలాగే అల్లు అర్జున్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేశారు.
అందులో ఏముందంటే.. అమితాబ్ అంటే తనకు ఇష్టం అని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారని.. ఎంతోమందికి ఆయన స్ఫూర్తి అని అల్లు అర్జున్ చెప్పారు. ఇక ఈ వీడియో పోస్ట్ చేస్తూ అమితాబ్ ‘‘కృతజ్ఞతలు అల్లు అర్జున్. మీరు నా అర్హతకు మించి ప్రశంసించారు. నిజం చెప్పాలంటే నేను నీ ప్రతిభకు, పనితీరుకు పెద్ద అభిమానిని. నువ్వు ఇలాగే ఎంతోమందికి స్ఫూర్తినిస్తూ ఉండాలి. ఇలాంటి హిట్స్ ఎన్నో అందుకోవాలని కోరుకుంటున్నా.. శుభాకాంక్షలు అని రాసుకొచ్చారు. ప్రజెంట్ అమితాబ్ ట్వీట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
#AlluArjun ji .. so humbled by your gracious words .. you give me more than I deserve .. we are all such huge fans of your work and talent .. may you continue to inspire us all .. my prayers and wishes for your continued success ! https://t.co/ZFhgfS6keL
— Amitabh Bachchan (@SrBachchan) December 9, 2024






