‘నేను వేసే ప్రతి అడుగులో నువ్వు ఉన్నావు’.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్

by I. Sairam |

టాలీవుడ్‌లో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న మ‌ల‌యాళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపి సుంద‌ర్(Gopi Sunder) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

‘నేను వేసే ప్రతి అడుగులో నువ్వు ఉన్నావు’.. కన్నీళ్లు పెట్టిస్తున్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఎంతో మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకున్న మ‌ల‌యాళ మ్యూజిక్ డైరెక్ట‌ర్ గోపి సుంద‌ర్(Gopi Sunder) ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గోపి సుందర్ తల్లి అయినటువంటి లివి సురేష్ బాబు(65) నేడు కన్నుమూశారు. కేరళ లోని కూర్కెన్ చెరిలోని తన అపార్టు‌మెంట్‌లో గురువారం అనారోగ్యం కారణంగా ఆమె చనిపోయారు. ఇక ఈ విషయాన్ని గోపి సుందర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు.

‘అమ్మా, మీరు నాకు జీవితాన్ని, ప్రేమను, నా కలలను అనుసరించే శక్తిని ఇచ్చారు. నేను సృష్టించిన ప్రతి మ్యూజిక్ నోట్ మీరు నాపై కురిపించిన ప్రేమను కలిగి ఉంటుంది. నీవు నన్ను విడిచి ఎక్కడికి పోలేదు- నా హృదయంలో, నేను వేసే ప్రతి అడుగులో నువ్వు జీవిస్తున్నావు. మీ ఆత్మకు శాంతి కలగాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను, కానీ మీరు ఇప్పటికీ నాతోనే ఉన్నారని నాకు తెలుసు. శాంతిగా ఉండు అమ్మా. మీరు ఎల్లప్పుడూ నా బలం, నా మార్గదర్శక కాంతి’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో అతని తల్లి మృతి విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

కాగా మలయాళ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా రాణిస్తున్న ఆయన తెలుగులో ‘నిన్ను కోరి’(Ninnu kori), మ‌జిలీ(Majili), గీత గోవిందం(Geetha Govindham), మళ్లీ మళ్లీ ఇది రాని రోజు(Malli Malli Idi Rani Roju), భలే భలే మగాడివోయ్(Bhale Bhale Magadivoy), ఊపిరి(Oopiri), 18 పేజెస్(!8 Pages), ఫ్యామిలీ స్టార్(Family Star) వంటి సినిమాల‌కు గొప్ప మ్యూజిక్, నేప‌థ్య సంగీతం అందించాడు. అయితే గోపి సుందర్ మలయాళ కుట్టి మయోని అలియాస్ ప్రియా నాయర్‌తో ప్రేమలో పడ్డారని అప్పట్లో ఓ రూమర్ నెట్టింట షికారు చేసిన సంగతి తెలిసిందే.

Next Story