Yellamma: ఎల్ల‌మ్మ వ‌చ్చేస్తోంది...సంక్రాంతికి బిగ్ అప్డేట్‌

by velandi.Saikiran |   (  Updated:2026-01-12 09:56:53  IST  )

సంక్రాంతి రోజున జనవరి 15వ తేదీన ఈ ఎల్ల‌మ్మ టైటిల్ టీజర్ అనౌన్స్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది.

Yellamma: ఎల్ల‌మ్మ వ‌చ్చేస్తోంది...సంక్రాంతికి బిగ్ అప్డేట్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: అందరూ ఎప్పుడెప్పుడా ? అని ఎదురుచూస్తున్న ఎల్లమ్మ సినిమా ప్రాజెక్టుపై అదిరిపోయే ప్రకటన వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ రాబోతుందట. నేరుగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సరిగ్గా సంక్రాంతి రోజున జనవరి 15వ తేదీన ఈ టైటిల్ టీజర్ అనౌన్స్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే నేటి నుంచి దానిపై చిత్ర బృందం ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

జబర్దస్త్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ

జబర్దస్త్ ద్వారా పరిచయమైన ఎల్దండి వేణు, ఇండస్ట్రీ ని ఇప్పుడు దున్నేస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన వేణు, ఇప్పుడు స్టార్ దర్శకుడు అయ్యాడు. బలగం అనే సెంటిమెంట్ సినిమా చేసి, చరిత్ర సృష్టించాడు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ ప్రాజెక్టు పట్టుకొని తిరుగుతున్నాడు. ఈ సినిమాను దాదాపు నలుగురు హీరోలు రిజెక్ట్ చేసినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. నాని, హీరో నితిన్, బెల్లంకొండ సాయి, శర్వానంద్ లాంటి చాలా మంది హీరోలు లైన్ లోకి వచ్చారు. కానీ చివరకు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ఫైనల్ అయ్యాడట. అంటే ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు దేవి శ్రీ ప్రసాద్. అలాగే ఇందులో హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది. ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉండగా, ఒకరు ఫైనల్ కానున్నారు. కాగా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Next Story