హరిహర వీరమల్లుపై YCP ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు

by velandi.Saikiran |

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు (

హరిహర వీరమల్లుపై YCP ట్రోలింగ్.. అదిరిపోయే కౌంటర్ ఇచ్చిన నాగబాబు
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) లేటెస్ట్ గా నటించిన సినిమా హరిహర వీరమల్లు ( Harihara Veeramallu). ఈ మూవీ... థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. గత వారం రిలీజ్ అయిన ఈ సినిమా మంచి కలెక్షన్స్ కూడా రాబడుతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో... హరిహర వీరమల్లు సినిమా... అట్టర్ ప్లాప్ అంటూ వైసీపీ అనేక రకాల పోస్టులు పెడుతూ రచ్చ చేస్తుంది.

అయితే దీనిపై తాజాగా జనసేన ఎమ్మెల్సీ, మెగా బ్రదర్ నాగబాబు ( Nagababu) స్పందించారు. హరిహర వీరమల్లు సినిమాపై వైసీపీ సోషల్ మీడియా రెచ్చిపోయి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నాగబాబు. వాళ్లు చేస్తున్న ప్రచారం దుర్మార్గం అంటూ ఫైర్ అయ్యారు. వైసీపీ అలాగే ఆ పార్టీ నేతలను ఏమనాలో అర్థం కావడం లేదని.. చురకలు అంటించారు.

హరిహర వీరమల్లు సినిమా విషయంలో వైసీపీ పార్టీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని జనసేన కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. అప్పుడే వైసిపి నేతలకు బుద్ధి వస్తుందని చురకలు అంటించారు. మరో 20 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని సెటైర్లు పేల్చారు. ఇక తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని క్లారిటీ ఇచ్చారు నాగబాబు. వచ్చిన పదవిని... ప్రజలకు న్యాయం చేసేందుకు వినియోగించుకుంటానని పేర్కొన్నారు.

Next Story