- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Yash : రామాయణం సెట్‌లో రావణుడు.. షూటింగ్ స్పార్ట్ నుంచి యశ్ ఫొటోస్ వైరల్
బాలీవుడ్(Bollywood)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులతో ‘రామాయణం’ (Ramayana) ఒకటి.

దిశ, సినిమా: బాలీవుడ్(Bollywood)లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్టులతో ‘రామాయణం’ (Ramayana) ఒకటి. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ నితీష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తుండగా.. నమిత్ మల్హోత్రాతో కలిసి అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక రెండు పార్టులుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ.. మొదటి పార్ట్ 2026 దీపావళి కానుకగా, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.
దీంతో ప్రజెంట్ షూటింగ్‌లో వేగం పెంచారు చిత్ర బృందం. ఈ క్రమంలోనే తాజాగా ఇందులో రావణుడు పాత్రలో నటిస్తున్న యశ్ (Yash) షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా.. షూటింగ్ సెట్ నుంచి సీన్ ఎక్స్‌ప్లేన్ చేస్తున్నట్లు కనిపిస్తున్న ఫొటోస్ కొన్ని నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. యశ్ సరసన మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఫిక్స్ అయినట్లు సమాచారం.
YASH TURNS RAVANA. HOLLYWOOD ACTION LEGEND GUY NORRIS JOINS RAMAYANA!#Yash is in beast mode as he begins shooting intense action scenes for #Ramayana, directed by #NiteshTiwari & produced by #NamitMalhotra. Stunt master #GuyNorris (#MadMaxFuryRoad) is choreographing next-level… pic.twitter.com/B32fu7rHJ6
— Siddharth R Kannan (@sidkannan) May 29, 2025






