- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘పర్సనల్ లైఫ్‌లోని ప్రతీ చిన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అక్కర్లేదు’.. హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్
సంతూర్ మమ్మి యాడ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటి యామి గౌతమ్ (Yami Gautam) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సంతూర్ మమ్మి యాడ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటి యామి గౌతమ్ (Yami Gautam) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. కొరియర్ బాయ్ కల్యాణ్ (Courier Boy Kalyan) చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ ముద్దుగుమ్మ నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ బాక్సాఫీసు వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. అంతేకాకుండా ఈ అమ్మడు గౌరవం లాంటి తెలుగు సినిమాల్లో నటించి సక్సెస్ సాధించకపోవడంతో యామీ గౌతమ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇక బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్(Director Aditya Dhar)తో జూన్ 4 వ తేదీన యామీ గౌతమ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. పెళ్లి తర్వాత కూడా ఈ నటి వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్‌లో వికీ డోనార్ (Wiki డోనార్డ్) సినిమాతో యామీ గౌతమ్ మంచి గుర్తింపు సంపాదించుకుంది.
హీరో సర్కార్, ఓ మై గాడ్, ఆక్షన్ జాక్షన్, ఉరి, కాబిల్ (Kabil) సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు దక్కించుకుంది. ఇక నువ్విలా మూవీ అనంతరం యామి గౌతమ్ నితిన్ హీరోగా వచ్చిన కొరియన్ బాయ్ కల్యాణ్, తరుణ్ యుద్ధం, అల్లు శిరీష్ గౌరవం సినిమాలతో యామీ గౌతమ్ తెలుగు వారికి దగ్గరైంది.
పబ్లిసిటీ కంటే గోప్యత ముఖ్యమని తాజాగా ఈ అమ్మడు పలు కామెంట్స్ చేసింది. పర్సనల్ లైఫ్‌లోని ప్రతీ చిన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అక్కర్లేదని ఈ నటి వెల్లడించింది. సెలబ్రిటీలు అన్ని విషయాలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటారు.. తినే ఆహారం నుంచి ఖాళీ టైంలో వారు చేసే ప్రతీ పని కూడా చెబుతుంటారని తెలిపింది. కానీ వీరందరికీ నేను భిన్నమని చెప్పుకొచ్చింది.
తనకు సోషల్ మీడియా ఖాతా ఉందని.. జిమ్‌లో గాయపడ్డాను అని.. కానీ ఈ విషయాలు అందరితో పంచుకోవడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదని యామీ గౌతమ్ వివరించింది. నా గురించి జనాలు ఆలోచించాలని అనుకోనని తెలిపింది. అలాగే తన కుమారుడ్ని కూడా సోషల్ మీడియాకు దూరంగా ఉండేలా చూస్తానని వెల్లడించింది.






