Yami Gautam: అందాల భామ యామీ గౌతమ్ అదిరిపోయే ఫొటో షూట్..!

by Kodari Anjali |   (  Updated:2025-01-31 06:55:44  IST  )

సంతూర్ (Santoor) మమ్మి యాడ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటి యామీ గౌతమ్ (Yami Gautham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Yami Gautam: అందాల భామ యామీ గౌతమ్ అదిరిపోయే ఫొటో షూట్..!
X

దిశ, వెబ్‌డెస్క్: సంతూర్ (Santoor) మమ్మి యాడ్‌తో ప్రేక్షకులకు దగ్గరైన నటి యామీ గౌతమ్ (Yami Gautham) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. (Courier boy Kalyan) మూవీలో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

యామీ గౌతమ్ నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అంతేకాకుండా ఈ అమ్మడు గౌర‌వం లాంటి తెలుగు సినిమాల్లో న‌టించి స‌క్సెస్ సాధించకపోవడంతో ఈ బ్యూటీ బాలీవుడ్‌ (Bollywood)లోకి ఎంట్రీ ఇచ్చింది.

బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్‌ (Aditya Dhar)తో 2021 జూన్ 4న యామీ గౌతమ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. వివాహనంతరం కూడా ఈ బ్యూటీ వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్‌లో వికీ డోనార్ (Vicki Donor) సినిమాతో యామీ గౌతమ్ మంచి గుర్తింపు సంపాదించుకుంది. హీరో (Hero), సర్కార్ (Sarkar), ఆక్షన్ జాక్షన్ , ఓ మై గాడ్ (Oh my god), ఉరి, సనమ్ రే (Sanam Ray), కాబిల్ (Kabil) చిత్రాలతో స్టార్ హీరోయిన్‌గా మంచి పేరు దక్కించుకుంది.

ఇక నువ్విలా (Nuvvila) మూవీ అనంరం యామి గౌతమ్ నితిన్ హీరోగా వచ్చిన కొరియర్‌బాయ్ కళ్యాణ్, తరుణ్ యుద్ధం, అల్లు శిరీష్ గౌరవం మూవీలతో యామీ గౌతమ్ తెలుగు వారికి దగ్గరైంది. ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో మెరిసిన యామీని రవిబాబు తెలుగు తెరకు పరిచయం చేశారు. నువ్విలా సినిమా ద్వారా యామీ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇక యామి గౌతమి హిందీలో అడపాద‌డ‌పా సినిమాల్లో నటిస్తూ.. ముందుకెళ్తుంది. ఇక ఇప్పుడు త‌ను ఉన్నానంటూ గుర్తు చేయ‌డానికి ఓ డిఫరెంట్ ఫొటో షూట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. కోట్ మోడల్ స్టైలిష్ డ్రెస్ ధరించి స్టన్నింగ్ ఫొటోలకు ఫోజులిచ్చింది. ఈ పిక్స్‌కు లవ్ సింబల్ జోడించి.. ధూమ్ ధామ్ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు పిక్స్ నెట్టింట ట్రెండింగ్‌లో ఉన్నాయి.

Next Story