వావ్ బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న యంగ్ బ్యూటీ.. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ అంటూ కామెంట్స్

by I. Sairam |

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

వావ్ బ్లాక్ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న యంగ్ బ్యూటీ.. మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ అంటూ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘మెహబూబా’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘డీజే టిల్లు’ మూవీతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఈ సినిమాలో రాధిక క్యారెక్టర్‌లో అదరగొట్టింది. తన అందం, అభినయంతో కుర్రకారు మనసులు కొల్లగొట్టింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. కానీ ఆ తర్వాత చేసిన పలు సినిమాలు అంతగా గుర్తింపును తెచ్చి పెట్టలేకపోయాయి. అయినప్పటికీ నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో గత్తరలేపుతుంది.

ఈ క్రమంలో ఈ భామ ఫొటోస్ నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. తాజాగా నేహా శెట్టి ఇన్‌స్టా(Instagram) వేదికగా కొన్ని పిక్స్ షేర్ చేసింది. బ్లాక్ కలర్ లెహంగాలో మత్తెక్కిస్తుంది. తన హాట్ పొజులతో పిచ్చెక్కిస్తుంది. ఇక వాటికి ‘వారసత్వ రంగులలో చిత్రించబడిన సంస్కృతి యొక్క కాన్వాస్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పిక్స్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు సూపర్, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఇన్ ది వరల్డ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story