- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వావ్.. చీరలో చాలా క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చిన మెగా బ్యూటీ.. పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే. ‘షాపింగ్ మాల్’(Shopping Mall) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే. ‘షాపింగ్ మాల్’(Shopping Mall) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదనే చెప్పాలి. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మన టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోలేకపోతుంది. అయితే గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari) చిత్రంలో తన నటనతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాలో నటించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. అయితే సంక్రాంతి కానుకగా ఎన్నో ఆశలతో జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రేంజ్‌లో ప్లాప్ అయింది.
ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది అంజలి. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అంజలి తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో గ్రీన్ కలర్ శారీ కట్టుకొని తన కుక్క పిల్లలతో దిగిన క్యూట్ ఫొటో షేర్ చేసింది. అంతేకాకుండా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు సో క్యూట్ చాలా బాగున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.






