Ram Charan: ‘పెద్ది’ నుంచి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న రామ్ చరణ్ లుక్

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’.

Ram Charan: ‘పెద్ది’ నుంచి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్.. ఆకట్టుకుంటోన్న రామ్ చరణ్ లుక్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన ఫస్ట్ షాట్ గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన రాగా.. ఈ సినిమా నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే తాజాగా ‘పెద్ది’ షూటింగ్ స్టార్ట్ అయినట్లు తెలుస్తుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా హైదరాబాద్‌లోని ఒక భారీ విలేజ్ సెట్‌లో సుదీర్ఘమైన, కీలకమైన షెడ్యూల్‌ను ప్రారంభించారు. ఈ షూటింగ్ సెట్ నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు సనా, దివ్యేందు శర్మ వర్కింగ్ స్టిల్స్ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మా యాక్షన్-ప్యాక్డ్ షెడ్యూల్ నవ్వులతో, చర్చలతో స్టార్ట్ అయింది.. ఇప్పటికే 30% షూట్ పూర్తయినందున, ఈ కొత్త షెడ్యూల్ సినిమాలోని ముఖ్యమైన భాగాన్ని కవర్ చేస్తుంది’ అంటూ తెలిపారు. కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 27, 2026న రామ్ చరణ్ పుట్టినరోజున విడుదల కానుంది.

Next Story