ఆ క్షణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు.. కచ్చితంగా మీరు గర్వపడేలా చేస్తానంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

తాను చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ సర్‌ను వెండితెరపై చూస్తూ, ఆయన నటనను ఆరాధిస్తూ పెరిగానని భాగ్యశ్రీ చెప్పింది.

ఆ క్షణాలను వర్ణించడానికి మాటలు సరిపోవు.. కచ్చితంగా మీరు గర్వపడేలా చేస్తానంటూ భాగ్యశ్రీ బోర్సే ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తెలుగులో మిస్టర్ బచ్చన్, ఆంధ్రా కింగ్ తాలూకా వంటి చిత్రాలు చేసి మంచి గుర్తింపు దక్కించుకుంది. కానీ సరైన హిట్ అందుకోలేకపోయింది. ఇక ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. స్టార్ హీరో శివ కార్తికేయన్ సరసన ‘సెయాన్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించే బంపర్ ఆఫర్ దక్కించుకుంది. కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థపై రాబోతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే కథగా ప్రేక్షకులను అలరించే భావోద్వేగాలు, మాస్ యాక్షన్ వినోదాన్ని చూపించబోతున్నారు. శివకుమారు మురుగేశన్ తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా.. భాగ్య శ్రీ బోర్సే ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

కమల్ హాసన్‌తో కలిసి దిగిన ఫొటోలు షేర్ చేస్తూ.. తాను చిన్నప్పటి నుంచి కమల్ హాసన్ సర్‌ను వెండితెరపై చూస్తూ, ఆయన నటనను ఆరాధిస్తూ పెరిగానని భాగ్యశ్రీ చెప్పింది. అలాంటిది, ఇప్పుడు అదే చిన్న అమ్మాయి ఆయన సొంత ప్రొడక్షన్‌లో వస్తున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుందని తాను అస్సలు ఊహించలేదని, తనకిది ఒక కలలా ఉందని వివరించింది. ఆయన్ని కలిసినప్పుడు తన తలపై చేయి వేసి ఆశీర్వదించిన ఆ క్షణంలో తనకు కలిగిన ఆనందాన్ని, ఎమోషన్‌ను వర్ణించడానికి తన దగ్గర మాటలు సరిపోవడం లేదని ఎంతో సంతోషపడింది. తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అద్భుతమైన క్షణం ఇదని పేర్కొంది. ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఈ సినిమాలో తన పాత్రలో ఎంత అద్భుతంగా నటించాలో అంతగా నటించి, ఆయన గర్వపడేలా చేస్తానని భాగ్యశ్రీ ప్రామిస్ చేసింది.

Next Story