- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
With Love : ఇది నా కథే.. చెప్పలేని ప్రేమ గురించి.. రానా దగ్గుబాటి
అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు.

దిశ, సినిమా : అభిషన్ జీవింత్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలలో నటించిన ఫీల్-గుడ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘విత్ లవ్’. మదన్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని సౌందర్య రజనీకాంత్‌తో పాటు నజరత్ పసిలియన్, మహేష్ రాజ్ పసిలియన్ ఎంఆర్‌పి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సంయుక్తంగా నిర్మించారు. ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా.. తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రానా దగ్గుబాటి.. ‘ చెప్పలేని ప్రేమ గురించి ఇక్కడ అంతా చాలా బ్యూటిఫుల్‌గా మాట్లాడారు. ట్రైలర్ చూసిన అందరూ కూడా చాలా కనెక్ట్ అయ్యారు. చూస్తున్నప్పుడు ఇది మన కథే అనిపిస్తోంది. సౌందర్య గారు తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని చెప్పాడు.






