The Raja Saab : రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉండనుందా?

by Phanindra |

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు

The Raja Saab : రాజాసాబ్ పార్ట్ 2 కూడా ఉండనుందా?
X

దిశ, వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. బహుబలి తర్వాత డార్లింగ్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. భారీ బడ్జెట్ అయితే తప్ప సినిమాలు చేయడం లేదు. డైరెక్టర్ మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ది రాజాసాబ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన గ్లింప్స్, పోస్టర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలాగే, తన కెరియర్లో మొదటి సారి హారర్ జానర్ లో నటిస్తుండటంతో మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల చేస్తారని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. రాజాసాబ్ రెండు భాగాలుగా రాబోతుందని, పార్ట్ 1 మాత్రమే కాకుండా పార్ట్ 2 కూడా ఉంటుందని సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఇటీవలే పుష్ప 2 క్లైమాక్స్ లో పార్ట్ 3 కి లీడ్ ఎలా ఇచ్చారో .. అదే విధంగా ఈ సినిమా చివరిలో ఇంట్రెస్టింగ్ లీడ్ ఇచ్చి పార్ట్ 2 కూడా ఉంటుందని చెబుతారట. ఇప్పటి వరకు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి, సలార్ , కల్కి .. ఇప్పుడు రాజాసాబ్ .. ఇలా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇన్ని సీక్వెల్స్ చేసిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక్కడే ..! ఇది తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దండాలయ్యా .. దండాలయ్యా అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

Next Story