- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రజినీ సినిమాలో శోభన.. మరో దళపతి అవుతుందా?
రజినీ హీరోగా రూపొందనున్న 'తలైవార్ 173'లో శోభన హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ సిబి చక్రవర్తి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. దీనిని లోక నాయకుడు కమల్ హాసన్ నిర్మించబోతున్నారు. ఈ మూవీకి ఇప్పటివరకు మేకర్స్ టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ చిత్రం రజినీకాంత్ 173వ మూవీగా రానుంది. దాంతో 'తలైవార్ 173' అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు. సిబి చక్రవర్తి ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లో చాలా బిజీగా ఉన్నాడు.
అందులో భాగంగా ఈ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకి జోడీగా శోభన నటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 1991లో వచ్చిన దళపతి మూవీలో రజనీకి జోడీగా శోభన నటించింది. ఈ మూవీలో వీరిద్దరి జంటకు అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. చాలాకాలం తర్వాత వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించబోతున్నారని వార్తలు బయటికి రావడంతో ఈ సినిమా మరో దళపతి అవుతుందని రజనీ అభిమానులు నమ్ముతున్నారు.
సిబి చక్రవర్తి కొంతకాలం క్రితం కార్తికేయ హీరోగా కాలేజ్ డాన్ అనే చిత్రాన్ని రూపొందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. తలైవార్ 173లో రజనీ హీరోగా కనిపించనుండగా, కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. రజినీ, కమల్ ఇద్దరూ కలిసి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది. దానిపై తమిళ ప్రేక్షకుల్లో తారాస్థాయిలో అంచనాలున్నాయి.






