- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ ‘ది రాజా సాబ్’ సినిమా వాయిదా పడనుందా.. కారణం అదేనా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల సలార్, కల్కి వంటి సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేశారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇటీవల సలార్, కల్కి వంటి సినిమాలతో బాక్సాఫీసును షేక్ చేశారు. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. డార్లింగ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ కల్కి-2(Kalki-2), స్పిరిట్, సలార్-2(Salar-2), ఫౌజి, కన్నప్ప(Kannappa) అలాగే ది రాజా సాబ్(The Raja Saab). మారుతి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హారర్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ‘ది రాజా సాబ్’ సినిమాలో రిద్ధి కుమార్(Riddhi Kumar), నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), హీరోయిన్లుగా నటిస్తుండగా.. యోగిబాబు, సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 10న విడుదల కాబోతుంది.
ఈ చిత్రం కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతూ ప్రభాస్ అభిమానులను అయోమయానికి గురయ్యేలా చేస్తుంది. ‘రాజా సాబ్’ షూటింగ్ పూర్తయినప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవుతున్న ట్లు సమాచారం. ఇప్పటి వరకు పూర్తైన ఫూటేజీ మూడున్నర గంటలు ఉండగా.. దానిని తగ్గించే ప్రయత్నంలో మేకర్స్ నిమగ్నమై నట్లు టాక్. ఇవన్నీ పూర్తి అయితే తప్ప ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపించడం లేదు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు పలు పుకార్లు షికారు చేస్తున్నాయి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అన్నీ అబద్ధాలు అని కొట్టిపారేస్తున్నారు.
READ MORE ...
షాకింగ్ న్యూస్.. ‘ది ప్యారడైజ్’ సినిమాలో నాని అలాంటి రోల్ చేయనున్నాడా..!






