- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pawan Kalyan: మళ్ళీ పవన్ కళ్యాణ్ " హరిహర వీరమల్లు " మూవీ వాయిదా పడనుందా..?
ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి

దిశ, వెబ్ డెస్క్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( pawan kalyan ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే ఇంకోవైపు ఖాళీ సమయం ఉన్నప్పుడు తను చేయాల్సిన షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. వాటిలో జ్యోతికృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు' కూడా ఒకటి. రెండేళ్ల క్రితం మొదలైన ఈ మూవీ పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వలన ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, రీసెంట్ గా మూవీ మేకర్స్ మార్చి 28న రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, తాజాగా మరోసారి 'హరిహర వీరమల్లు' ( Hari Hara Veera Mallu ) వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చేస్తున్నాయి. అయితే, షూటింగ్ పూర్తికాకపోవడంతో అనుకున్న సమయం కంటే ఇంకా ఆలస్యంగా విడుదల చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా, ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం దీనిపై రియాక్ట్ అయ్యారు.
'హరిహర వీరమల్లు' చిత్రాన్ని అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించిన వర్క్ పూర్తయిందని.. మిగతా వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి చెప్పిన డేట్ కే ప్రేక్షకుల ముందుకొస్తుంది. రెండు పార్ట్ లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ నటించగా.. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త నటీ నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం నుంచి పవన్ పాడిన 'మాట వినాలి' అనే సాంగ్ నెట్టింట వైరల్ అయింది. పవన్ గొంతుతో సాగిన ఈ సాంగ్ అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది.






