- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Vishwak Sen: సినీ ఇండస్ట్రీని వదిలేస్తా.. విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్
విశ్వక్ సేన్ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్ : హీరో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ( Vishwak Sen) హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లైలా’ ( Laila ). ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నిర్వహించారు. అయితే, ఈ ఫంక్షన్ లో నటుడు పృథ్వి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అతను మాట్లాడిన మాటల పై లైలా చిత్ర యూనిట్ రియాక్ట్ అయింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీట్ లో హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహు గారపాటి పాల్గొన్నారు. విశ్వక్ మాట్లాడుతూ.. " బాయికాట్ లైలా" అంటూ సోషల్ మీడియాలో కొందరూ ట్రెండ్ చేసేది చూసి మేము షాక్ అయ్యామని అన్నారు. ఒక సినిమా తీయాలంటే ఎంత కష్టం ఉంటుందో మాకు తెలుసు.. కానీ, ఇప్పుడు బాయికట్ లైలా అని ఒకటి కాదు పది కాదు ఏకంగా 25వేల ట్వీట్లు వేశారు. ఇలా చేస్తే మేము ఏం అయిపోవాలన్నారు. అతను మాట్లాడే సమయంలో నేను అక్కడ లేను. కావాలంటే వీడియోలు కూడా చెక్ చేసుకోండి. పృథ్వీ ( Prudhvi Raj ) మాట్లాడేటప్పుడు నేను ఎదురుగా ఉన్నట్టు నిరూపిస్తే ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోతా " అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ మాటకి మీడియా వాళ్ళు కూడా షాక్ అయ్యారు.
దీనిపై రియాక్ట్ అయిన వారు " సినిమా ఈవెంట్ లను అడ్డు పెట్టుకుని ప్రతి సారి ఇలాగే ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు, ప్రేక్షకులం మేము కూడా అడుగుతున్నాము ఇది ఎంత వరకు న్యాయం " అని ప్రశ్నిస్తున్నారు. " ఇప్పుడొచ్చి సారీ చెప్తే ఏం సుఖం .. తప్పు జరగకుండా ముందే జాగ్రత్త పడాలంటూ " నెటిజన్స్ కూడా సినిమా వాళ్ళపై మండిపడుతున్నారు.






