'బ్లడీ రోమియో' కూడా ఆలస్యం కానుందా?

by Pulgam srinivas |

'ది ప్యారడైజ్' డిలే అయితే.. 'బ్లడీ రోమియో ఆ ప్రభావం.

బ్లడీ రోమియో కూడా ఆలస్యం కానుందా?
X

దిశ, వెబ్ డెస్క్: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ది ప్యారడైజ్ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 21న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే ఈ సినిమా నిజంగా ఈ సంవత్సరం ఆగస్టులో విడుదల అవుతుందా లేదా అనే విషయంలో ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో స్పష్టత లేదు. అందుకు ప్రధాన కారణం ఇప్పటికీ ఈ మూవీకి సంబంధించిన చాలా భాగం షూటింగ్ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఈ సినిమా గనుక ఆగస్టులో విడుదల అయినట్లయితే, నాని ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బ్లడీ రోమియో సినిమా అనుకున్న సమయానికి పట్టాలెక్కే అవకాశం ఉంటుంది. ఒకవేళ ది ప్యారడైజ్ సినిమా కాస్త ఆలస్యమైనా, బ్లడీ రోమియో చిత్రానికి కూడా బ్రేక్ పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అందుకు ప్రధాన కారణం బ్లడీ రోమియో చిత్రాన్ని లండన్‌లో ఎక్కువ భాగం చిత్రీకరించాలనేది మేకర్స్ ప్లాన్. అక్కడ షూటింగ్ నిర్వహించాలంటే వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ది ప్యారడైజ్ సినిమా అనుకున్న సమయానికి పూర్తికాకపోతే, లండన్‌లో వాతావరణ పరిస్థితులు అనుకూలించే వరకు వేచి చూడాల్సిన పరిస్థితి రావచ్చు. ఆ కారణంతో కూడా ఈ సినిమా ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఓజీ వంటి భారీ ప్రాజెక్ట్ తర్వాత సుజిత్ నుండి వస్తున్నా మూవీ కావడంతో 'బ్లడీ రోమియో'పై భారీ అంచనాలు నెలకొనే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Next Story