- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tollywood: అర్జున్ రెడ్డి కథకి నో చెప్పిన ఇద్దరు స్టార్ హీరోలు .. ఎవరంటే?
ఒక్క సినిమాతో అటు బాలీవుడ్ ( Bollywod ) , ఇటు టాలీవుడ్ ( Tollywood ) రికార్డ్స్ బ్రేక్ చేసిన ఏకైక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా .

దిశ, వెబ్ డెస్క్ : ఒక్క సినిమాతో అటు బాలీవుడ్ ( Bollywod ) , ఇటు టాలీవుడ్ ( Tollywood ) రికార్డ్స్ బ్రేక్ చేసిన ఏకైక డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ( Sandeep reddy vanga) . ఆ సినిమా మరేదో కాదు అర్జున్ రెడ్డి( Arjun Reddy ) . ఎలాంటి అంచనాలు లేకుండా మన ముందుకొచ్చిన ఈ చిత్రం సంచలనాలు సృష్టించింది. సందీప్ బయట చూడటానికి చాలా కోపంగా కనిపిస్తారు, కానీ కూల్ గానే ఉంటారని సినీ వర్గాల వారు చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda ) ఈ మూవీ రిలీజ్ అవ్వనంత వరకు ఒక నార్మల్ యాక్టర్. కానీ, అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ ఫేమ్ పెరిగింది. ఈ చిత్రం రౌడీ బాయ్ కి మంచి బ్రేక్‌ను ఇచ్చింది. అలాగే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు బాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చేలా చేసింది.
" పెళ్లి చూపులు" ( Pelli Choopulu ) మూవీతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ఈ సినిమా అన్ని సెంటర్స్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ ఆడియెన్స్ ను కట్టిపడేసిందని అప్పట్లో స్టార్ హీరోస్ సైతం ప్రశంసించారు. అయితే, ఈ కథ విజయ్ కంటే ముందుగా కొంతమంది హీరోలకు వద్దకు వెళ్లిందట. వారు నో చెప్పారని ఫిల్మ్ నగర్లో ఎన్నో వార్తలు వచ్చాయి.
అర్జున్ రెడ్డి పాత్రకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కరెక్ట్ గా సెట్ అవుతారని డైరక్టర్ సందీప్ రెడ్డి అనుకున్నారట. అందు వలన ముందుగా బన్నీకి కథ వినిపించారట. కథ నచ్చినప్పటికీ.. కమర్షియల్ హీరోగా సెటిల్ అయిన సమయంలో లవ్ స్టోరీస్ చేయనని చెప్పారట. దీంతో, యంగ్ హీరో శర్వానంద్ ని కూడా హీరోగా చేయమని అడిగారట. అయితే, అతను కూడా నో చెప్పడంతో ఈ స్టోరీ విజయ్ దగ్గరికి వచ్చింది. సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనకి కూడా తెలుసు. ఆ తర్వాత విజయ్ కి వరుస ఆఫర్లు వచ్చాయి. అలా సినిమాలు చేసుకుంటూ రౌడీ స్టార్ గా ఎదిగాడు.






