ఆ సినిమా చూసి నా తల్లిదండ్రులు అలా అనేసరికి నా మనసు ముక్కలైపోయింది.. కంగనా షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-06-02 05:47:24  IST  )

‘గ్యాంగ్‌స్టర్’ సినిమా విడుదలయ్యాక తన తండ్రి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని తెలిపింది.

ఆ సినిమా చూసి నా తల్లిదండ్రులు అలా అనేసరికి నా మనసు ముక్కలైపోయింది.. కంగనా షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఫైర్ బ్యాండ్ కంగనా రనౌత్ ‘గ్యాంగ్‌స్టర్’ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన కంగనా.. రాజకీయాల్లోనూ రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన తాజా చిత్రం ‘భారత్ భాగ్య విధాత’ జూన్ 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కంగన పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో, తన మొదటి సినిమా చూసి తన తల్లిదండ్రులు ఎలా స్పందించారు, ఆ సమయంలో ఆమె మనసు ఎంతలా గాయపడింది అనే ఆసక్తికర విషయాలను పంచుకుంది. మొదట్లో తన కుటుంబానికి సినీ పరిశ్రమపై మంచి అభిప్రాయం ఉండేది కాదని, అప్పట్లో ఇండస్ట్రీ అండర్‌వరల్డ్ చేతుల్లో ఉండేదనే భయం వారిలో ఉండేదని చెప్పింది. ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా విడుదలయ్యాక తన తండ్రి అసలు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదని, తల్లిని అడిగితే.. "నువ్వు ఇంకా చిన్నదానివి, మైనర్‌వి.. నీతో అలాంటి రొమాంటిక్ సీన్స్ చేయించారు" అని అందరి ముందు అనడంతో తన మనసు ముక్కలైందని ఆవేదన వ్యక్తం చేసింది.

సమాజం ఏమనుకుంటుందో అనే భయంతోనే వారు అలా మాట్లాడారని, అప్పటి నుండి తన సినిమాల గురించి తల్లిదండ్రుల నుండి ఎలాంటి రివ్యూస్ ఆశించకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే, ‘క్వీన్’ సినిమా చూసి అమితాబ్ బచ్చన్ గారు తనకు ఒక అందమైన లేఖ రాసినప్పుడు.. అంతటి స్టార్ గుర్తించిన నటనను, తన తండ్రి గుర్తించలేకపోయారనే బాధ కలిగిందని, కానీ ఆయన ఆర్టిస్ట్ కాదు కాబట్టి తప్పుపట్టలేమని కంగన పేర్కొంది. చివరకు ఆమెకు ప్రెసిడెంట్ చేతుల మీదుగా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మాత్రమే తన తల్లిదండ్రులు ఎంతో సంతోషించారని, అదే వారి ఆలోచనలో పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పింది. కంగన ‘ఫ్యాషన్’ సినిమాకు మొదటి సారి సపోర్టింగ్ యాక్ట్రెస్‌గా, ఆ తర్వాత క్వీన్, తను వెడ్స్ మను రిటర్న్స్, మణికర్ణిక, పంగా చిత్రాలకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డులను అందుకుంది.

Next Story