Coolie: రజనీకాంత్ నుంచి నాగార్జున, శ్రుతి వరకు రెమ్యునరేషన్ ఎంతంటే ?

by velandi.Saikiran |

200 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట రజనీకాంత్. ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజు 50 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు

Coolie: రజనీకాంత్ నుంచి నాగార్జున, శ్రుతి వరకు రెమ్యునరేషన్ ఎంతంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా అంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సినిమా కూలీ (Coolie ). సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth) హీరోగా అక్కినేని నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర, శృతిహాసన్ లాంటి కీలక నటీనటులు కూలీ సినిమాలో కనిపించనున్నారు. ఒక్కో ఇండస్ట్రీ నుంచి ఒక్కో స్టార్ ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమా బంపర్ హిట్ అవుతుందని అందరు అంచనా వేస్తున్నారు.

దాదాపు 350 నుంచి 400 కోట్లతో ఈ సినిమా తీస్తున్నారని ప్రచారం చేస్తున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఈ చిత్రంలో నటిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్ గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమా కోసం ఏకంగా 200 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట రజనీకాంత్. ఆ తర్వాత దర్శకుడు లోకేష్ కనకరాజు 50 కోట్లు చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఏకంగా 15 కోట్లు తీసుకుంటున్నాడని చెబుతున్నారు. టాలీవుడ్ గ్లామర్ నటుడు అక్కినేని నాగార్జున 10 కోట్లు వసూలు చేస్తున్నారట.

అలాగే అమీర్ ఖాన్ కు 20 కోట్లు ముట్టినట్లు నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఉపేంద్ర అలాగే సత్యరాజ్ చెరో 5 కోట్లు తీసుకుంటున్నారట. హీరోయిన్ శృతిహాసన్ 4 కోట్లు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కాగా ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర చాలా బాగుంటుందని అంటున్నారు. చివరలో 20 నిమిషాల సినిమా.. అందరినీ ఆకట్టుకుంటుందట. కాగా ఈ సినిమా వార్ 2 రిలీజ్ అవుతున్న రోజే వస్తోంది. అయినప్పటికీ.. రజనీకాంత్ నటించిన కూలీ... బంపర్ హిట్ అవుతుందని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

Next Story