- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాట్.. రామాయణ మూవీలో ఫస్ట్ సీతగా అనుకున్నది ఆ బ్యూటీనా.. గ్రేట్ పెయిర్ అయ్యే చాన్స్ మిస్ చేసుకున్నావుగా అంటూ కామెంట్స్
కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: కేజీఎఫ్ 1,2(KGF) సినిమాలతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిన హీరోయిన్ శ్రీనిధి శెట్టి(Srinidhi Shetty) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాగే తన అందం, అభినయంతో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu Jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం నేచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న ‘హిట్-3’(Hit-3) సినిమాలో నటిస్తుంది. ఇక ఈ చిత్రం మే 1న రిలీజ్ కాబోతుంది. అయితే ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఆమె మాట్లాడుతూ.. ‘నేను రామాయణ(హిందీ) సినిమాకు స్క్రీన్ టెస్ట్ ఇచ్చాను. అది వాళ్లకి కూడా బాగా నచ్చింది. ఇక సీతగా నన్నే తీసుకుందామని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ కేజీఎఫ్ తర్వాత ప్రేక్షకులు యష్‌ని రావణుడిగా, నన్ను సీతగా అంగీకరించకపోవచ్చు అని నాకు అనిపించింది, అందుకే నేను ఈ ప్రాజెక్టును ఓకే చేయలేక పోయాను’ అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శ్రీనిధి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. గ్రేట్ పెయిర్ అయ్యే చాన్స్ మిస్ చేసుకున్నావని, సీత క్యారెక్టర్‌కి నువ్వే బాగా సెట్ అయ్యేదాని వని, సాయి పల్లవి సీతకు పనిమనిషిలా ఉంటుందని నెటిజన్లు చాలా కామెంట్స్ చేస్తున్నారు.






