Dil Raju : డ్రగ్స్ తీసుకుంటే బహిష్కరిస్తాం : దిల్ రాజు సంచలన ప్రకటన

by Muthe.Rajitha |

హైదరాబాద్‌(Hyderabad)లోని శిల్పకళా వేదికలో నేడు జరిగిన 'అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం'(International Anti-Drug Day) సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు.

Dil Raju : డ్రగ్స్ తీసుకుంటే బహిష్కరిస్తాం : దిల్ రాజు సంచలన ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లోని శిల్పకళా వేదికలో నేడు జరిగిన 'అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం'(International Anti-Drug Day) సందర్భంగా నిర్వహించిన యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. ఈ కార్యక్రమం తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దిల్ రాజు మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమ(Tollywood)లో డ్రగ్స్ వినియోగాన్ని కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నార్కోటిక్ అధికారులను కోరారు.

మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే విధానం అమలులో ఉందని, అదే తరహాలో టాలీవుడ్‌లో కూడా ఇటువంటి నిర్ణయాన్ని త్వరలో అమలు చేసేందుకు TFDC ద్వారా చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ విషయంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో సంప్రదింపులు జరిపి, అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన సూచించారు.

Next Story