- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ సింగర్ వల్ల ఐదు లక్షల డాలర్లు నష్టం.. చర్చనీయాంశంగా మారిన మెల్‌బోర్న్ నిర్వాహకుల పోస్ట్
బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్(Neha Kakkar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.

దిశ, సినిమా: బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్(Neha Kakkar) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు ఇటీవల సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య నేహా మెల్‌బోర్న్(Melbourne)లో ఓ మ్యూజిక్ కన్సర్ట్‌కు హాజరైంది. అయితే ఈ ఈవెంట్‌కు ఆమె మూడు గంటల పాటు ఆలస్యంగా వెల్లడంతో అంతా ఆమెను ట్రోల్ చేశారు. అలాగే నెట్టింట పలు పోస్టులు షేర్ చేశారు. దీంతో వాటిని చూసిన నేహా ఇటీవల పలు పోస్టుల ద్వారా అసలు విషయం బయటపెట్టింది. తన టీమ్‌తో పాటు తనకు నిర్వాహకులు డబ్బులు ఇవ్వకుండా పారిపోయారని ఆరోపణలు చేసింది.
కనీసం నీళ్లు, ఆహారం కూడా పెట్టలేదని తన ఆవేదనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో.. తాజాగా, మెల్‌బోర్న్ నిర్వాహకులు స్పందించి షాకింగ్ విషయాలు వెల్లడించారు. నేహా కక్కర్ వల్ల తాము 5లక్షల డాలర్లు నష్టపోయినట్లు ఇన్‌స్టా్గ్రామ్ ద్వారా తెలిపారు. ఈవెంట్‌కు సంబంధించిన అన్ని రుజువులు తమ వద్ద ఉన్నాయని అన్నారు. అలాగే ఆమె చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తమని చెప్పారు. ప్రస్తుతం నిర్వాహకుల పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక వాటిని చూసిన వారంతా పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అలాగే నేహా కక్కర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






