మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాము.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్

by I. Sairam |   (  Updated:2025-03-13 12:17:15  IST  )

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు.

మీ అందరికీ మా సినిమా నచ్చుతుందని అనుకుంటున్నాము.. యంగ్ హీరో ఇంట్రెస్టింగ్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో కొన్ని సినిమాలతో అలరించాడు. అయితే అతని ఖాతాలో మంచి హిట్ పడలేవు. కానీ రీసెంట్‌గా ‘క’(Ka) మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. ప్రస్తుతం ‘దిల్ రూబా’(dilRuba) సినిమాలో నటిస్తున్నాడు. విశ్వకరుణ్(Vishwa Karun) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని.. శివమ్ సెల్యూలాయిడ్ ప్రొడక్షన్స్ అండ్ ప్రముఖ మ్యూజిక్ లేబల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలింతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో రుక్సర్ థిల్లాన్(Rukshar Thillon) హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ మార్చి 14న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకొని మూవీపై మరింత క్యూరియాసిటీని పెంచాయి. ఇదిలా ఉంటే.. రేపు ‘దిల్ రూబా’ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా ఈ రోజు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ రుక్సార్ థిల్లాన్‌తో పాటు మరొకరు శ్రీ తిరుమల తిరుపతి స్వామి వారిని దర్శించుకున్నారు.

ఇక దర్శనం అనంతరం వారు అక్కడే ఓ వీడియో చేసి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇక ఆ వీడియోలో కిరణ్ అబ్బవరం.. రేపు మా సినిమా రిలీజ్ కాబోతుంది. కచ్చితంగా ఈ మూవీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము.. అందరికీ హ్యాపీ హోలీ అని చెప్పుకొచ్చాడు. అలాగే హీరోయిన్ కూడా మాట్లాడుతూ మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.. కచ్చితంగా మా సినిమా చూసి ఆనందించండి అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Next Story