- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సర్కే చునర్’ పాటతో మాకు సంబంధం లేదు: సెన్సార్ బోర్డ్ కీలక ప్రకటన
‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట వివాదంపై తాజాగా సెన్సార్ బోర్డ్ (CBFC) సెన్సేషనల్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ పాట తమ పరిధిలోకి రాదని, డిజిటల్ కంటెంట్‌కు సర్టిఫికేషన్ తాము ఇవ్వమని బోర్డ్ స్పష్టం చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘కె.డి: ది డెవిల్’ (K.D.: The Devil) చిత్రంలోని ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాటపై చెలరేగుతున్న వివాదంపై తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) స్పందించింది. ఈ పాట సర్టిఫికేషన్ విషయంలో తమను అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని బోర్డ్ ఛైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. వివాదాస్పదమైన ‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట సర్టిఫికేషన్ కోసం తమకు ఎలాంటి దరఖాస్తు అందలేదని బోర్డ్ స్పష్టం చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు CBFC సర్టిఫికేట్ ఇవ్వదని, ఈ విషయంలో చాలామందికి అవగాహన లేక బోర్డ్‌ను తప్పుబడుతున్నారని కామెంట్ చేశారు. సినిమాలో మహిళలపై చిత్రీకరణ విషయంలో బోర్డ్ సభ్యులు అత్యంత సున్నితంగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని.. వివాదాల కంటే నిర్మాణాత్మక చర్చలకే తాము ప్రాధాన్యత ఇస్తామని చైర్మన్ ప్రసూన్ జోషి (Prasoon Joshi) తెలిపారు.
‘సర్కే చునర్ తేరీ సర్కే’ పాట విషయంలో లేవనెత్తే ప్రశ్నలు, ఫిర్యాదులను సంబంధిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ లేదా ఆ పాటను నిర్మించిన మేకర్స్‌కే పంపాలని సూచించింది. అయితే, ఆ పాటలో లీడ్ రోల్‌లో నటించిన నోరా ఫతేహీ ఇప్పటికే ఆ సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా, తాజాగా సెన్సార్ బోర్డ్ చేసిన ప్రకటనతో వివాదం మరింత రాజుకుంది.






