‘కాక్రోచ్’ మూవీతో సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం..

by Chukka Sudharani |

పలు చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాక్రోచ్’.

‘కాక్రోచ్’ మూవీతో సొసైటీలోని డార్క్ సైడ్ చూపిస్తున్నాం..
X

దిశ, సినిమా: పలు చిత్రాలతో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు అందుకున్న డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి రూపొందిస్తున్న తాజా చిత్రం ‘కాక్రోచ్’. అభిలాష్ సుంకర, ప్రేమసన్, నవీన్, తీర్థ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ ఈ నెల 6న విడుదల కాబోతున్నది. ఈ మేరకు మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి, నిర్మాత బి.బాపిరాజు. ‘మా కాంబినేషన్‌లో చేస్తున్న మరో వినూత్న సినిమా ‘కాక్రోచ్’. ఎవరూ కావాలని తప్పులు చేయరు. ఆకలి, నిరుద్యోగం, పేదరికం వారితో తప్పులు చేయిస్తాయి. పని దొరకని యువత విధిలేని పరిస్థితుల్లో తప్పుదారిలో వెళ్తుంటారు. పొట్ట కూటికోసం కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలోకి వస్తుంటారు. అలాంటి కొందరు క్రిమినల్స్, వేశ్య మధ్య సాగిన ప్రేమ కథ ఈ సినిమాకు నేపథ్యం. ఈ కథను వీలైనంత బోల్డ్‌గా తెరకెక్కించాము. సమాజంలో జరుగుతున్న ఘటనలకు వాస్తవిక రూపంగా ఈ సినిమాను నిర్మించాం. తన పేదరికమే శాపమై వ్యభిచార వృత్తిలోకి వచ్చే వేశ్య కొద్దిపాటి ఆదాయం కోసం ఎన్నో బాధలు పడుతుంది. ఇలాంటి అంశాలన్నీ మా మూవీలో ఆకట్టుకునేలా, మనసును కదిలించేలా హార్డ్ హిట్టింగ్‌గా చూపించాము. రియల్ లైఫ్ స్టోరీని రా అండ్ రస్టిక్ మేకింగ్‌తో చూడాలనుకునే ప్రేక్షకులకు మా మూవీ బాగా నచ్చుతుంది’ అని తెలిపారు.

Next Story