- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీకోసం ఇంకాస్త ముందే వస్తున్నాం.. ‘ఆదిత్య369’రీరిలీజ్ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్ (ట్వీట్)
గత కొద్ది రోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సినిమా: గత కొద్ది రోజుల నుంచి రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. దీంతో చిన్న సినిమాలతో పాటు స్టార్ హీరోస్ ఫ్లాప్ అయినవి కూడా థియేటర్స్‌లోకి వస్తూ బాక్సాఫీసు వద్ద రాణిస్తున్నాయి. త్వరలోనే నందమూరి బాలకృష్ణ(Balakrishna) నటించిన ‘ఆదిత్య 369’(Aditya 369) మూవీ కూడా రీరిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్రబృందం డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ టైమ్ ట్రావెల్ సైన్స్ ఫిక్షన్ సినిమాకు థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్స్‌లోకి రాబోతున్నట్లు తెలిపారు. తాజాగా, మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.
థియేటర్స్ దొరకడంతో ‘ఆదిత్య-369’ముందుగానే రాబోతున్నట్లు వెల్లడించారు. ‘‘మీ ఉత్సాహం మేం చూసాం.. అందుకే, మీకోసం ఇంకాస్త ముందే వస్తున్నాం. టైమ్ లెస్ క్లాసిక్ ఏప్రిల్ 4వ తేదీన విడుదల కాబోతుంది. మీకు గొప్ప అనూభూతిని అందిస్తుందని ఆశిస్తున్నాం’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, దివంగత దిగ్గజ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(Singer SP Balasubrahmanyam) సమర్పణలో, శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఫస్ట్ ఇండియన్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇదే.
ఇందులో కృష్ణదేవరాయలుగా నందమూరి బాలయ్య యాక్టింగ్, సింగీతం శ్రీనివాసరావు (Srinivasa Rao)డైరెక్షన్ స్కిల్స్, ఎస్పీ బాలసుబ్రమణ్యం గాత్రం, ఇళయరాజా అద్భుతమైన మ్యూజిక్, నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad)నిర్మాణ విలువలు, జంధ్యాల సంభాషణలు వంటి ఈ సినిమాలో ఉన్న ప్రతి అంశం 'ఆదిత్య 369' మూవీని ఆల్ టైం క్లాసిక్ మూవీగా నిలబెట్టాయి. 1991లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రేక్షకులను అప్పట్లోనే సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లి, అదిరిపోయే ఎక్స్పీరియన్స్ ను ఇచ్చింది. ఇప్పుడు మరోసారి రీరిలీజ్ అవుతుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీ ఉత్సాహం మేం చూసాం...
— Sridevi Movies (@SrideviMovieOff) March 24, 2025
అందుకే, మీకోసం ఇంకాస్త ముందే వస్తున్నాం 🤩
Experience #NBK's Timeless Classic, #Aditya369 4K re-release in theaters on 4th April 🌐
Nata🦁#NandamuriBalakrishna #SingeetamSrinivasaRao #SPBalasubrahmanyam @ilaiyaraaja #Jandhyala @krishnasivalenk #VSRSwamy… pic.twitter.com/BE7rluXZdf






