Nani: బాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాం.. హిందీ ఇండస్ట్రీపై టాలీవుడ్ స్టార్ట హీరో షాకింగ్

by Chukka Sudharani |   (  Updated:2025-04-27 15:25:01  IST  )

తాజాగా హిట్-త్రీ (Hit-3) ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని (Nani).. బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Nani: బాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తున్నాం.. హిందీ ఇండస్ట్రీపై టాలీవుడ్ స్టార్ట హీరో షాకింగ్
X

దిశ, సినిమా: తాజాగా హిట్-త్రీ (Hit-3) ప్రమోషన్స్‌లో పాల్గొన్న నాని (Nani).. బాలీవుడ్ ఇండస్ట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బాలీవుడ్‌ను మనమే కాపాడుతున్నామా? అనే ప్రశ్నపై నాని స్పందిస్తూ.. ‘ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు తెలుగు సినిమాలకు మార్కెట్ భారీగా పెరిగింది. టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకుంటున్నాయి. వాళ్ల సినిమాలకు పోటీగా మన సినిమాలు నిలుస్తున్నాయి. అయితే.. మనమే బాలీవుడ్‌ను కాపాడుతున్నాము అని నేను అనను. కానీ బ్యాలెన్స్ చేస్తున్నాము. ఒకప్పుడు బాలీవుడ్‌లో ఎన్నో భారీ భారీ సినిమాలు వచ్చాయి. ఆ ఇండస్ట్రీలో మళ్లీ అలాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చాడు.

కాగా.. నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘హిట్-3’. ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి శైలేష్ కొలను (Sailesh Kolanu) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) హీరోయిన్‌గా నటిస్తుంది. నాని సొంత బ్యానర్ వాల్ పోస్టర్ సినిమాతో కలిసి యూనిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై ప్రశాంతి తిపిర్నేని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ భారీ అంచనాల మధ్య మే 1న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో ప్రస్తుతం ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు చిత్ర బృందం.

Next Story