- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Saif Ali Khan : దాడికి ముందు ఆ ఇంట్లో పార్టీ జరిగిందా!
బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మీద దాడి జరిగిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) మీద దాడి జరిగిన విషయం తెలిసిందే. గురువారం తెల్లవారుజామున ముంబైలోని ఆయన నివాసంలోకి చొరబడిన దుండగుడు కత్తితో సైఫ్‌పై దాడి చేశాడు. ఈ దాడిలో ఆయన ఒంటిపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. ముంబైలోని లీలావతి ఆసుపత్రి(Leelavathi Hospital)లో సైఫ్‌కు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. మరోవైపు నిందితుడి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
కాగా, దాడి ఘటనకు ముందు సైఫ్ అలీఖాన్ భార్య, బాలీవుడ్ స్టార్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) తన ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకున్నట్లు తెలిసింది. తన సోదరి కరిష్మా కపూర్(Karishma Kapoor), సోనమ్ కపూర్(Sonam Kapoor), రియా కపూర్(Ria Kapoor)లతో కలిసి డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను కరీనా కపూర్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోకు ‘గర్ల్స్ నైట్’ (Girls night) అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా.. ‘సైఫ్ అలీఖాన్‌కు వెన్నుముఖ శస్త్రచికిత్స పూర్తైంది. ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.






