- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Rashmika Mandana : రష్మికకు కర్ణాటక నేతల వార్నింగ్
నేషనల్ క్రష్ రష్మిక మందన(Rashmika Mandana)కు కర్ణాటక కాంగ్రెస్ నేతలు(Karnataka Congress Leaders) మాస్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్ : నేషనల్ క్రష్ రష్మిక మందన(Rashmika Mandana)కు కర్ణాటక కాంగ్రెస్ నేతలు(Karnataka Congress Leaders) మాస్ వార్నింగ్ ఇచ్చారు. కర్ణాటక పట్ల ఆమె చిన్నచూపుతో వ్యవహరిస్తోందని ప్రెస్ మీట్లో రష్మికను కడిగి పారేశారు. త్వరలోనే ఆమెకు తగిన గుణపాఠం చెబుతామని తేల్చి చెప్పారు. ఇంతకీ రష్మిక మీద నాయకులు ఇంత ఫైర్ అవడానికి కారణం ఏమిటంటే.. ఇటీవల బెంగుళూరు(Bengulur) వేదికగా "ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్"(International Film Festival) కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రావాల్సిందిగా రష్మికను పలువురు కర్ణాటక కాంగ్రెస్ నేతలు సంప్రదించగా.. దీనిపై రష్మిక విముఖత వ్యక్తం చేసిందట. అంతేకాదు తనది హైదరాబాద్ అని, కర్ణాటక అంటే ఎక్కడో కూడా తనకు తెలియదు అన్నట్టు వ్యవహరించిందట. గతంలో కూడా అనేకసార్లు కన్నడ నాయకులు, ఈవెంట్ నిర్వహకులతో 'నేషనల్ క్రష్' ఇలాగే ప్రవర్తించిందట.
దీంతో చిర్రెత్తుకొచ్చిన నాయకులు రష్మికకు త్వరలోనే బుద్ధి చెబుతామని మండిపడుతున్నారు. అయితే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్(Karnataka Deputy CM DK Shivakumar) కూడా ఈవ్యవహారంపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పలువురు నటీనటులు హాజరుకాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ నిర్మాతలు, దర్శకులు ఈ వ్యవహారపంపై చర్యలు తీసుకోవాలని.. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్ధతు కూడా ఉండాలనే విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సొంత రాష్ట్రంలో జరిగే వేడుకలు కన్నడ నటీనటులే రాకపోతే ఇంక ఏమిటి ప్రయోజనం అని మండిపడ్డారు. తీరు మార్చుకోని వారిని ఎలా సరిచేయాలో తనకు బాగా తెలుసని హెచ్చరించారు.






