‘అదిదా సర్‌ప్రైజు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన వార్నర్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్స్.. వీడియో వైరల్

by Gugulothu.Kavitha |   (  Updated:2025-03-24 12:05:16  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood).

‘అదిదా సర్‌ప్రైజు’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన వార్నర్.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్స్.. వీడియో వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్(Nithin), శ్రీ లీల(Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్ హుడ్’(Robin Hood). వెంకీ కుడుముల(Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్(Mythri Movie Makers Banner) పై నవీన్ ఎర్నేని(Naveen Yerneni), రవి శంకర్(Ravi Shanker) భారీ బడ్జేట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఇక ఈ మూవీలో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్(David Warner) నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్‌గా అతనికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఆదివారం హైదరాబాద్‌(HYDERABAD)లో రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre Release Event) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక దీనికి స్పెషల్ గెస్ట్‌గా డేవిడ్ వార్నర్ విచ్చేశాడు.

అయితే తాజాగా అతను ఈ ఈవెంట్‌లో రాబిన్ హుడ్ మూవీలోని ‘అదిదా సర్‌ప్రైజు’ అనే పాటకు అదిరిపోయే స్టెప్పులేశాడు. ఇతనితో పాటు హీరో నితిన్, అలాగే పలువులు యాక్టర్స్ కలిసి స్టేజీ పై డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు వార్నర్ భయ్యా.. నీ యవ్వ తగ్గేదేలే అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Next Story