- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
War 2 Twitter Review: వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. మూవీ ఎలా ఉందంటే..?
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2’(War-2).

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR), బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘వార్ 2’(War-2). డైరెక్టర్ అయాన్ ముఖర్జీ(Ayan Mukherjee) తెరకెక్కించిన ఈ సినిమాలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్గా నటించింది. అయితే రజనీ నటించిన కూలీ(Coolie) చిత్రం కూడా ఈ సినిమాకు పోటీగా బరిలోకి దిగడంతో సర్వత్రా ఇప్పుడు అందరి చూపు ఈ రెండు సినిమాలపైన మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మన దేశంలో వార్2 చిత్రం తెల్లవారుజాము షోలు పడగా ఇతర దేశాల్లోనూ ఫస్ట్ షోలు పడ్డాయి. మూవీ చూసిన వారు తమదైన శైలిలో రియాక్ట్ అవుతూ సామాజిక మాద్యమాల్లో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు.
వార్ 2 సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారని, గత స్పై యూనివర్స్ చిత్రాలకు భిన్నంగా ఈ సారి కథ ఉందని అంటున్నారు ట్విట్టర్లో పోస్ట్ పెడుతున్నారు. సినిమా స్టార్టింగ్ సెటప్ బాగా ఉండడమే గాక, హీరోల ఇంట్రడక్షన్ సీన్స్, డ్యాన్స్ నంబర్, కొన్ని ట్విస్ట్‌లు బాగా వర్కౌట్ అయ్యాయని పేర్కొంటున్నారు. ఎన్టీఆర్ షార్ట్లెస్ ఈ సినిమా మొత్తానికే హైలెట్ అని అంటున్నారు.
ఇంటర్వెల్, ఫ్రీ క్లైమాక్స్ ట్విస్టులు అదిరి పోయాయని, ఓ ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ స్టార్స్ సైతం క్యామియోలు ఎంట్రీ ఇచ్చారని, త్వరలో రానున్న ఓ సినిమా క్యారెక్టర్ సైతం కాసేపు కనిపించి అలరిచిందని చెబుతున్నారు. కియారా గ్లామర్, ఊపిరి ఊయల పాట విజువల్‌గా వండర్‌గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. మొత్తానికైతే ఇద్దరు లీడ్ యాక్టర్స్ తమ పాత్రలకు తగ్గట్టు నటించారని, క్లైమాక్స్‌లో వారి పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్లో ఉందని పోస్టులు పెడుతన్నారు.
Also Read..






