ఆ OTT లోకి ‘వార్ 2’.. వచ్చేది ఎప్పుడంటే ?

by velandi.Saikiran |   (  Updated:2025-08-14 17:05:06  IST  )

వార్ 2 సినిమాను కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు OTT రూపంలో

ఆ OTT లోకి ‘వార్ 2’.. వచ్చేది ఎప్పుడంటే ?
X

దిశ, వెబ్ డెస్క్: జూనియర్ ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2. భారీ అంచనాల నడుమ ఇవాళ ఈ సినిమా రిలీజ్ అయింది. ఇదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాకు వెళ్లేవారు ఎక్కడ తగ్గలేదు. కలెక్షన్స్ కూడా తొలిరోజు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది.

సినిమాలో కొన్ని విషయాలు మినహా... సినిమా మాత్రం బాగుందని అంటున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ.. డీటెయిల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. భారీ ధరకే ఈ వార్ 2 సినిమాను కొనుగోలు చేసిందట నెట్ ఫ్లిక్స్.

అయితే ఈ సినిమా అక్టోబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు OTT రూపంలో రాబోతుందని తెలుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా కియారా అద్వానీ హీరోయిన్ గా మెరిశారు.

Next Story