- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NTR ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ పై బిగ్ అప్డేట్
హిందీ అభిమానులతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ వార్ 2. దీనికి ముఖ్య కారణం జూనియర్

దిశ, వెబ్ డెస్క్: హిందీ అభిమానులతో పాటు తెలుగు వాళ్ళు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న మూవీ వార్ 2. దీనికి ముఖ్య కారణం జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ హీరోగా చేస్తుండగా... జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేక పాత్రలో మెరువనున్నారు. దాదాపు ఇందులో జూనియర్ ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలో కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్సల్ లో భాగంగా ఇప్పటికే వార్ సినిమా రిలీజ్ అయి బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వార్ 2 వస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా విపరీతంగా చేస్తోంది చిత్ర బృందం. ఆగస్టు 14వ తేదీన వార్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. అయితే ఇలాంటి నేపథ్యంలో.... జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు నిర్మాత నాగ వంశి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి కీలక ప్రకటన చేశారు. ఆదివారం రోజున హైదరాబాద్ లో వార్ 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే దీనిపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదని... ప్రభుత్వం నుంచి పర్మిషన్స్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేస్తామని కూడా తెలిపారు. దింతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.






