- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘18 శక్తి పీఠాల సందర్శన అనే నా ఆధ్యాత్మిక స్వప్నయాత్ర నేడు మొదలైంది’.. భర్తతో కలిసి తల్లి చరణాల వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపిన నటి
తెలుగు సినిమా నటుడైన వరుణ్ సందేశ్ నటి వితిక షేరును ప్రేమించి వివాహం చేసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినిమా నటుడైన వరుణ్ సందేశ్ నటి వితిక షేరును ప్రేమించి వివాహం చేసుకున్నారు. వితిక షేరు తెలుగు సినిమా నటి అండ్ మోడల్. 2016 లో వీరు అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు.వితికా 11 సంవత్సరాల వయస్సులో బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆమె ముంబై, హైదరాబాద్‌లలో చదువు పూర్తి చేసి.. హైదరాబాద్‌లోని లఖోటియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ నుండి ఫ్యాషన్ డిజైన్‌లో డిప్లొమాను కూడా పొందింది.
ఇక వరుణ్ సందేశ్ 2007 లో ‘హ్యాపీ డేస్’ సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. ఈ హీరో ప్రముఖ తెలుగు రచయిత జీడిగుంట రామచంద్ర మూర్తి మనవడు. అయితే తాజాగా వీరిద్దరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుని.. ‘‘18 శక్తి పీఠాల సందర్శన అనే నా ఆధ్యాత్మిక స్వప్నయాత్ర నేడు మొదలైందని వితిక షేరు భర్తతో కలిసి తల్లి చరణాల వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపింది. నా తొలి అడుగు కాంచీపురంలోని శ్రీ కామాక్షి తల్లి శక్తి పీఠం.
ఆలయంలో అడుగుపెట్టిన ఆ క్షణం… అలౌకికమైన శాంతి, మునుపెన్నడూ అనుభవించని ఆధ్యాత్మిక స్పందన.. ఆ ప్రకాశంలో హృదయం తడిసిపోయింది. తల్లి చరణాల వద్ద కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపాను. అమ్మా.. నీవు ఇచ్చిన వాగ్దానం గుర్తు చేసుకుంటూ... నీ ఆశీస్సులతో మిగిలిన శక్తి పీఠాల వైపు నా యాత్ర కొనసాగుతుంది. ఇది భక్తి, ఇది శ్రద్ధ, ఇది నమ్మకంతో నిండిన యాత్ర’’ అంటూ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.






