- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహేశ్ ఫ్యాన్స్‌కు పండగే.. గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్‌లో టైటిల్‌తో పాటు ఆ సర్ప్రైజ్ కూడా!
సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబ్‌ట్రాటర్ (వర్కింగ్ టైటిల్)తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించిన సినిమా తరవాత రాబోతున్న జక్కన్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబ్‌ట్రాటర్ (వర్కింగ్ టైటిల్)తో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి ప్రపంచస్థాయిలో గుర్తింపు సంపాదించిన సినిమా తరవాత రాబోతున్న జక్కన్న సినిమా ఇదే కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నేడు ఈ సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించనున్నారు. ఈవెంట్‌లో సినిమా టైటిల్ విడుదల చేయబోతున్నారు.
టైటిల్ రివీల్ చేసేందుకే భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అయితే కేవలం టైటిల్ మాత్రమే కాకుండా సినిమాకు సంబంధించిన ప్రపంచాన్ని పరిచయం చేస్తూ విజువల్స్ కూడా విడుదల చేస్తామని జక్కన్న ఎక్స్‌లో పేర్కొన్నారు. దీంతో మహేశ్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి లీక్ అయిన ఎడారిలోని సీన్లు, ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు విజువల్స్ విడుదల చేస్తే సినిమా హైప్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది.






