స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

by Chukka Sudharani |

తమిళ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో తొలిసారిగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

స్వాతంత్ర్య దినోత్సవం స్పెషల్‌గా రాబోతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
X

దిశ, సినిమా: తమిళ స్టార్ హీరో సూర్య తన కెరీర్‌లో తొలిసారిగా 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో పూర్తి స్థాయి తెలుగు చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో మమితా బైజు హీరోయిన్ కాగా.. రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు మేకర్స్. ‘ప్రియమైన అభిమానులారా.. ఈ వేడుకలను ఇలాగే కొనసాగించడానికి మా దగ్గర అదిరిపోయే అప్డేట్ ఉన్నది. విశ్వనాథ్ అండ్ సన్స్ కోసం దారి ఇవ్వండి.. ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లను జయించడానికి వస్తున్నారు’ అంటూ అదిరిపోయే పోస్టర్‌ను షేర్ చేశారు.

విడుదల చేసిన పోస్టర్‌లో సూర్య చేతిలో గొడుగు, ఫోన్ పట్టుకుని సీరియస్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు. ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం, అలాగే వీకెండ్స్ కావడంతో ఈ సెలవులు సినిమా సక్సెస్‌కు మరింత ప్లెస్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఖుష్ అవుతున్నారు అభిమానులు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్డేట్స్ ఆకట్టుకోవడంతో పాటు.. తెలుగులో సూర్య మొదటి చిత్రం కావడంతో ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో కూడా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’పై భారీ అంచనాలు ఉన్నాయి. కాగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Next Story