- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vishwak Sen: ఫంకీ రిలీజ్ డేట్ ఫిక్స్.. గట్టి ప్లానే వేసిన విశ్వక్ సేన్
ఈ ఏడాది ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు.

దిశ, సినిమా: ఈ ఏడాది ‘లైలా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ఇప్పుడు ‘ఫంకీ’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీకి కామేడీ ఎంటర్‌టైనింగ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన అనుదీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఇటీవల టీజర్ విడుదల కాగా.. సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అంతే కాకుండా.. ఈ సినిమాతో విశ్వక్ మంచి కమ్‌బ్యాక్ ఇస్తాడంటూ గట్టిగా హోప్స్ పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీకి రిలీజ్‌కు సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. ఫంకీ మూవీ క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఆల్మోస్ట్ ఇదే డేట్ కన్ఫర్మ్ అవుతుందని తెలుస్తుండగా.. విశ్వక్ సేన్ ఈసారి గట్టి ప్లానే వేశాడు అంటున్నారు మేకర్స్. లింక్
- Tags
- Vishwak Sen
- Funky






