Vishwak Sen: విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్

by Chukka Sudharani |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) ఒకటి.

Vishwak Sen: విశ్వక్ సేన్ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై బిగ్గెస్ట్ అప్డేట్
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindi) ఒకటి. తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) దర్శకత్వం వహించిన ఈ మూవీని డి. సురేష్ బాబు నిర్మించగా.. సుశాంత్ రెడ్డి, అభినవ గోమటం, వెంకటేష్, కాకమాను, అనిషా అంబ్రోస్, సిమ్రాన్ చౌదరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2018లో విడుదలైన ఈ మూవీ కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 12 కోట్ల వరకు రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో విశ్వక్ సేన్ గ్రాఫ్ కూడా ఇండస్ట్రీలో బాగా పెరిగింది.

ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోగా.. ఈ నగరానికి ఏమైంది లాంటి సినిమాలు చేయ్యి అన్నా అంటూ విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యాన్స్‌కు ఓ బిగ్టెస్ట్ గుడ్ న్యూస్ అయితే అందింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ తీసే ప్లాన్ ఉన్నారు చిత్ర బృందం. ఈ విషయన్ని ప్రకటిస్తూ.. ‘సర్‌ప్రైజ్!!! కన్యా రాశి బృందం తిరిగి వస్తోంది.. జూన్ 28 & 29 తేదీలలో ఎగ్జైటింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి.. సిద్ధంగా ఉండండి’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా.. ‘ఈ నగరానికి ఏమైంది?’ సీక్వెల్‌ను తరుణ్ భాస్కర్ మరోసారి తనదైన స్టైల్లో తెరకెక్కించబోతుండగా.. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయనుంది. లింక్

Next Story