- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FUNKY Teaser: విశ్వక్ సేన్ ఫంకీ టీజర్...నవ్వులే, నవ్వులు
ఈ మూవీనే ఫంకీ ( FUNKY). ఇందులో విశ్వక్ సేన్ హీరోగా ఉండగా హీరోయిన్ గా కాయాదు లోహర్ ( Kayadu Lohar ) నటిస్తున్నారు. ఈ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ ( Vishwak Sen ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. డిఫరెంట్ కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విశ్వక్ సేన్, ఇప్పుడు మరో ఫన్నీ మూవీతో వస్తున్నారు. ఈ మూవీనే ఫంకీ ( FUNKY). ఇందులో విశ్వక్ సేన్ హీరోగా ఉండగా హీరోయిన్ గా కాయాదు లోహర్ ( Kayadu Lohar ) నటిస్తున్నారు. ఈ సినిమాకు జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ ( Anudeep KV) దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమా నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టీజర్ ను తాజాగా లాంచ్ చేసింది విచిత్ర బృందం. ఇక ఈ టీజర్ లో అనుదీప్ మార్క్ స్పష్టంగా కనిపించింది. ప్రతి సీన్ లోనూ కామెడీ పండింది. అంతేకాదు హీరో విశ్వక్ సేన్ తన ఎనర్జిటిక్ నటన టీజర్ లో కనిపించింది. ఈ సినిమాలో దర్శకుడి పాత్రలో విశ్వక్ సేన్ కనిపించాడు. ఈ నేపథ్యంలోనే హీరోయిన్ కాయాదు లోహర్, విశ్వక్ మధ్య ఉండే లవ్ సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. ఈ టీజర్ తో సినిమాపై హైప్ పెరిగింది.






