లంకా దహనం సీన్లు చూస్తే కానీ నమ్మకం కలుగదేమో.. రాజమౌళిపై విశ్వహిందూ పరిషత్ ఫైర్

by Ajay Maddhiboyina |

దర్శకుడు రాజమౌళి ఇటీవల వారణాసి సినిమా ఫంక్షన్‌లో తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

లంకా దహనం సీన్లు చూస్తే కానీ నమ్మకం కలుగదేమో.. రాజమౌళిపై విశ్వహిందూ పరిషత్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: దర్శకుడు రాజమౌళి ఇటీవల వారణాసి సినిమా ఫంక్షన్‌లో తనకు దేవుడిపై నమ్మకం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా ఈ వ్యాఖ్యలపై హిందూ సంఘాలు ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఇదే విషయంపై విశ్వహిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళికి డబ్బు మదం, అహంకారం తలకెక్కాయని అన్నారు. అందుకే హిందువుల విశ్వాసాలు దెబ్బతినేలా మాట్లాడారని అన్నారు. యావత్ హిందూ సమాజం రెండు రోజులుగా ఆందోళన చేస్తుంటే, చేసిన తప్పుకు క్షమాపణ చెప్పడానికి కూడా ఆయనకు మనసు రావడంలేదని మండిపడ్డారు.

లంకా దహనం సీన్లు చూస్తే గానీ హనుమంతుడిపై రాజమౌళికి నమ్మకం కలగదేమో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమౌళి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వ్యాఖ్యానించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో జిహాదీ మాఫియా నిధులు ఉన్నాయని ఆరోపించారు. అందుకే అనేక సినిమాల్లో హిందూ కుటుంబ వ్యవస్థను అవమానించేలా, విశ్వాలను కించపరిచేలా సన్నివేశాలు ఉంటున్నాయని చెప్పారు. దీని వెనుక ముంబైలోని మాఫియా ఉందని ఆరోపించారు. దీని పై దర్యాప్తు సంస్థలు సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

Next Story